Aug 31,2023 13:36

ప్రజాశక్తి-బాపట్ల : రేపల్లె  మండలం పిరాటలంక గ్రామానికి చెందిన కమతం శృతి బయోటెక్నాలజీ విభాగంలో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి డాక్టరేట్‌ను అందుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ 39, 40 కన్వోకేషన్‌లో వైస్‌ ఛాన్స్లర్‌ రాజశేఖర్‌ చేతుల మీదుగా శృతి డాక్టరేట్‌ పట్టాను అందుకున్నారు. ఆచార్య కె.కస్తూరి పర్యవేక్షణలో మెరైన్‌ నోకార్డియోప్సిస్‌ డాసన్‌విల్లి -ఖూదీ-5 నుండి వేరుచేయబడిన బయోయాక్టివ్‌ సమ్మేళనాల యాంటీమైక్రోబయల్‌, యాంటీ ఆక్సిడెంట్‌-సైటోటాక్సిక్‌ కార్యకలాపాల అంశంపై శృతి పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. యస్‌.కె.డి యూనివర్సిటికి చెందిన ఆచార్య డి.సురేష్‌ కుమార్‌, ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌ శృతి పరిశోధన ఫలితాలపై సంతృప్తి చెంది డాక్టరేట్‌ పట్టాను శృతికి అందించారు. ఈ కార్యక్రమంలో బయొటిక్నలజి విభాగాధిపతి కృష్ణసత్య, సైన్స్‌ జీన్‌ అండ్‌ బి.వి.ఎస్‌ఛైర్‌పర్సన్‌ సింహాచలం, శ్రీనివాస్‌, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.