మన శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యం. ఇది కాల్షియాన్ని అందించటంలో దోహదపడుతుంది. కండరాల కదలిక, మెదడు, శరీరానికి సిగల్స్ అందించేందుకు అవసరం. బలమైన ఇమ్యూనిటీకి కూడా విటమిన్ డి అవసరం. ప్రస్తుతం వర్షాకాలం ఎండ తగలదు. ప్రతిరోజూ తగినంత మొత్తంలో విటమిన్ డి అవసరం. ఇది సూర్యరశ్మి నుంచే కాదు; కొన్ని ఆహార పదార్థాల నుంచి కూడా లభిస్తుంది. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపలు, గుడ్డు, పుట్టగొడుగులు, చీజ్‌లలో దొరుకుతుంది. ఇంకా పుట్టగొడుగులు తీసుకుంటే విటమిన్ డి అందుతుంది. వీటితో పాటు పాలు, హోల్ గ్రెయిన్స్, నారింజ, పెరుగు తీసుకోవచ్చు. విటమిన్ డి ఆహారం ద్వారా తగినంత అందకపోతే డాక్టర్ సలహాతో విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
మరో ముఖ్య విషయం : విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం కూడా సరైంది కాదు. రక్తంలో విటిమన్ డి లెవల్స్ పెరుగుతాయి. వికారం, వాంతులు, కండరాల బలహీనత, ఇబ్బంది, నొప్పులు, ఆకలి తగ్గడం, డీహైడ్రేషన్, మూత్రవిసర్జన, దాహం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, డాక్టర్ సూచించిన మోతాదులోనే సంప్లిమెంట్స్ తీసుకోవాలి.
రోగనిరోధక శక్తికి దోహదం : డి విటమిన్ ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధకతనే కాదు..ఆనందం, ఉల్లాసం కూడా అందించనుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
విచారంగా ఉండటం, కోపం, చిరాకు పడటం వెనక కూడా 'డి విటమిన్' లోపమే కారణమని తెలుస్తోంది. శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది ఆహారంతో లభించే కాల్షియాన్ని శరీరం బాగా గ్రహించేలా చేస్తుంది. ఎముకలు గుల్ల బారకుండా చూస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటిని పోగొడుతుంది. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషాన్ని కలిగిస్తుంది. మన మెదడు సక్రమంగా పని చేయడానికి న్యూరో స్టెరాయిడ్లను వాడుకుంటుంది. మానసిక సమస్యలకు 'విటమిన్ డి'తో ప్రత్యక్ష సంబంధం ఉంది. విటమిన్ డిలో చాలా రకాలున్నాయి. చర్మానికి ఎండ తగిలినపుడు 7 డి హైడ్రో కొలెస్ట్రాల్ పుడుతుంది. ఇది డి3గా మారుతుంది. ఇది కాలేయాన్ని చేరుకొని 25 హైడ్రాక్సీ విటమిన్ డి అవుతుంది. శరీరం దీన్నే వాడుకుంటుంది. రోజూ కాసేపు ఎండ తగిలేలా చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఎండతో సెరటోన్ హర్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక స్థితిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుంది.










