
న్యూయార్క్: 7వ సారి ఏటిపి టైటిల్‌ను చేజిక్కించుకొని సెర్బియాకు చెందిన టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఆదివారం జరిగిన ఏటిపి ఫైనల్స్‌లో జకోవిచ్ 6-3, 6-3తో జెన్నిక్ సిన్నర్‌పై వరుససెట్లలో గెలుపొందాడు. ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్లు నెగ్గిన జకోవిచ్.. కెరీర్‌లో 40వ మాస్టర్స్-100 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అలాగే 400 వరాలపాటు టాప్‌సీడ్‌గా నిలిచిన తొలి టెన్నిస్ క్రీడాకారుడుగానే జకోవిచ్ మరో రికార్డును సాధించాడు.