న్యూఢిల్లీ : ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ యమహా మోటార్ ఇండియా దీపావళి పండుగ సందర్బంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. తమ 150సిసి ఎఫ్‌జడ్ శ్రేణీ, 125సిసి ఎఫ్‌ఎల్ హైబ్రిడ్ స్కూటర్లపై తగ్గింపును కల్పిస్తున్నట్లు పేర్కొంది. మోటార్ సైకిళ్లపై రూ.3వేల నుంచి రూ.5వేల వరకు డిస్కౌంట్‌ను, స్కూటర్లపై రూ.3,000 రాయితీని ఇస్తున్నట్లు వెల్లడించింది.