ఆన్‌లైన్ కంటే తక్కువ ధరలకే..!
హైదరాబాద్ : ప్రముఖ రిటైల్ చెయిన్ సంస్థ బిగ్ సి దీపావళి పండుగ సందర్బంగా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధమాకా ఆపర్స్‌లో ప్రతీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.10,000 వరకు ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాంక్‌తో పాటు రూ.4,000 వరకు విలువ కలిగిన ఖచ్చితమైన బహుమతి ఇవ్వనున్నట్లు బిగ్ సి ఫౌండర్, సిఎండి బాలు చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా స్మార్ట్ వాచ్ ఆఫర్, లాయల్టీ పాయింట్స్, స్మార్ట్ టివి తదితర మరెన్నో ఆఫర్లు అందిస్తున్నామన్నారు. బజాజ్ ఫైనాన్‌్‌స ద్వారా మొబైల్‌స కొనుగోలుపై రూ.9వేల వరకు ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాంక్, ప్రతీ మొబైల్, స్మార్ట్ టివి, ట్యాప్‌టాప్ కొనుగోలుపై ఎస్‌బిఐ ద్వారా రూ.3వేల వరకు, ఐడిఎఫ్‌సి ద్వారా రూ.7,500 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇస్తోన్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేయబడిన మొబైల్స్ కొనుగోళ్ళపై రూ.5వేల విలువ కలిగిన ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ.499కే పొందవచ్చని తెలిపారు. ప్రతీ స్మార్ట్ టివిపై ఖచ్చితమైన బహుమతితో పాటు రూ.5199 విలువ కలిగిన ఫింగర్స్ బార్ స్పీకర్‌ను కేవలం రూ.2499కు, ఐఫోన్ మొబైల్ కొనుగోలుపై రూ.7,000 వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నామన్నారు. బ్రాండెడ్ అస్సెసరీస్‌పై 51 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చన్నారు. అదే విధంగా ఎటిఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండానే ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చన్నారు. ప్రతీ పండుగను ప్రత్యేక సందర్బాన్ని పురస్కరించుకుని ఆఫర్లను ప్రకటించడం బిగ్ సి అనవాయితని.. ఈ దఫా దీపావళికి ప్రకటించిన ఆకర్షణీయ రాయితీలను కూడా వినియోగదారులు ఉపయోగించుకోవాలని బాలు చౌదరీ కోరారు.