Jul 08,2023 11:53

ప్రజాశక్తి -పాలకోడేరు (పశ్చిమగోదావరి) : నిజమైన ప్రజా సేవకుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని పాలకోడేరు మండల పరిషత్‌ అధ్యక్షులు భూపతి రాజు సత్యనారాయణ రాజు (చంటి రాజు) అన్నారు. విస్సాకోడేరు రావి చెట్టు సెంటర్లో రాజశేఖర్‌ రెడ్డి 74వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి ఎంపీపీ చంటి రాజు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వృద్ధులకు దుపట్టాలు, చీరలు, పళ్ళు పంపిణీి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బొల్లా శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ కందుల నాగరాజు, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ రాజు నాయకులు దుండి అశోక్‌ బాబు, పాలకవర్గం సభ్యులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.