Mar 25,2023 12:30

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని కసింకోట అదనపు ఎస్‌ఐ నాగేశ్వరరావు అన్నారు. స్థానిక ఇంటిగ్రేటెడ్‌ బాలికల వసతి గృహంలో విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు రేబాక మధు ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినిలకు పరీక్షల సామాగ్రి పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు యమ్‌.అప్పలరాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుత సౌకర్యాలను అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానానికి చేరడమే ముఖ్య లక్ష్యంగా భావించాలని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ శాఖ అధికారిణి పి నిర్మల, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జిల్లా అధ్యక్షులు కోరిబిల్లి పరమేష్‌, వీరేంద్ర జీవీఎంసీ ఉద్యోగి శివలంక సత్యనారాయణ, విజ్జు వీరేంద్ర కాండ్రేగుల శంకర్‌ దళిత నాయకులు పావాడ సన్యాసిరావు, చంటి వసతి గఅహ సిబ్బంది పాల్గొన్నారు.