ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని పప్పురు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం జడ్పీ చైర్మన్ నగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరరావు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఎంపీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఆ తరగతులను బోధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ట్యాబులు పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, సిద్ధిరాచర్ల సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీటీసీ పద్మాకర్ రెడ్డి, సర్పంచ్ పెద్దన్న, స్కూల్ కమిటీ చైర్మన్ సంజమ్మ, సలహ కమిటి చైర్మన్ పెద్దిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటర్శ్వరులు, వైసీపీ నాయకులు సంజీవరాయుడు, నర్సింహులు, జగన్ యాదవ్, ప్రభు, ఉపాద్యాయులు, నూరుల్లా, కిరణ్ రాజ్, ప్రభాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










