
- ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సూపర్-750లో పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ ప్రత్యర్థుల చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యారు. కిదాంబి శ్రీకాంత్ 17-21, 18-21తో జూనియర్ పొపొవ్(ఫ్రాన్స్) చేతిలో, లక్ష్యసేన్ 15-21, 18-21తో ఆర్మండ్ మెర్కెలే(ఫ్రాన్స్) చేతిలో ఓడారు. ఈ టోర్నీకి భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ రాయ్ గాయం కారణంగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.