
ప్రజాశక్తి-బుచ్చయ్యపేట(అనకాపల్లి జిల్లా) : చోడవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో వివిధ విభాగాల్లో దివ్యాంగ విద్యార్థులు సత్తా చాటినట్లు హెచ్‌ఎం కే.సత్యారావు గురువారం తెలిపారు. సీనియర్ రన్నింగ్ విభాగంలో రావలపూడి గణేష్, బాలికల రన్నింగ్ విభాగంలో తుంపాల శ్రావణి, శారీరిక వైకల్యం విభాగంలో ప్రథమ స్థానంలో చొప్ప జాన్ తృతీయ స్థానంలో నిలిచారు. వినికిడి లోపం విభాగం స్లోవాక్లో సుంకర కుమార్ ప్రథమ స్థానం, పల్లి ప్రసాద్ ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రత్యేక ఉపాధ్యాయులు బిఏ రాజు, డ్రిల్ మాస్టర్ కిరణ్ కుమార్, వెంకట్, డివిజే అప్పారావు అభినందించారు.