ప్రజాశక్తి - ఏలూరు : ఉంగుటూరు మండలం నారాయణపురం మహాత్మా గాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న పప్పల ఏలేసుబాబు శారీరక వైకల్యం ఉంది. (దివ్యాంగుడు )చేతులతో పరీక్ష రాయలేని పరిస్థితి. ఈ క్రమంలో ఆ విద్యార్థికి సహాయకునితో పరీక్ష రాసేందుకు విద్యాశాఖ అధికారులు అనుమతిచ్చారు. దీంతో ఆ స్టూడెంట్ బంధువు ఏలేసుబాబు పక్కనే ఉండి పరీక్షకు హాజరయ్యారు.










