Sep 21,2023 21:53

హైదరాబాద్‌ : బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో కొత్తగా హైదరాబాద్‌ - కొలంబో మధ్య డైరెక్ట్‌ విమాన సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 2నుంచి ఈ రెండు నగరాల మధ్య తమ సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత మెరుగు పడనున్నాయని ఆ సంస్థ పేర్కొంది. బుధవారం మినహా అన్ని రోజుల్లో సేవలు లభ్యం అవుతాయని పేర్కొంది.