Sep 08,2023 12:35

క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చాలా సమయాన్ని తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికే వెచ్చిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మహేంద్ర సింగ్‌ ధోనీ, తన స్నేహితులతో కలిసి యూఎస్‌ క్వార్టర్‌ మ్యాచ్‌ని వీక్షించాడు. ఈ మ్యాచ్‌ అనంతరం అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్‌ ఆడాడు ధోనీ. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు హితేశ్‌ సంఘ్వీ అనే బిజినెస్‌మ్యాన్‌. 'ధోనీ, డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా రాజీవ్‌ శర్మతో గోల్ఫ్‌ ఆడుతున్నా.. మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్యూ మిస్టర్‌ ప్రెసిడెంట్‌..' అంటూ సోషల్‌ మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేశాడు హితేశ్‌ సంఘ్వీ.