
చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ 2023 సంవత్సరంలో మరోసారి జట్టుకు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో సీఎస్‌కే తొలిసారి కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే జడ్డూ కెప్టెన్సీ భారాన్ని హ్యాండిల్ చేయలేకపోవడంతో యాజమాన్యం తిరిగి ధోనినే కెప్టెన్‌గా నియమించింది. చివరి మ్యాచ్‌ల్లో ధోని కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ.. సీఎస్‌కే తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా ప్రకటనటో చెన్నై అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈమేరకు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.