
బాపట్ల : బాపట్ల మండలంలోని గుడిపూడి, బర్తిపూడి గ్రామాల్లోని పని ప్రదేశాల్లో శనివారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేతలు వ్యవసాయ కూలీల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఉపాధి సమస్యల పరిష్కారం పై ఈనెల 5వ తేదీన కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాకు కూలీలంతా రావాలని పిలుపునిచ్చారు. ఉపాధి కూలీల ఆన్‌లైన్ ఫోటోని ఎత్తివేయాలని, వ్యవసాయంలో యంత్రాలు వచ్చిన తర్వాత పనులు బాగా తగ్గిపోయాయని, వందరోజులకి తగ్గకుండా పని చూపించాలని డిమాండ్ చేశారు. కూలీ డబ్బులు రెగ్యులర్‌గా వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి.కఅష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు..