May 04,2023 08:42

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అఖిల భారత సర్వీసు అధికారులంతా చరాస్తుల వివరాలు వెల్లడిరచాలని, వీటిలో షేర్లు, సెక్యూరిటీ, డిబెంచర్ల వివరాలు కూడా తెలియజేయాలని కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 1968 నాటి ప్రవర్తనావళి ప్రకారం ఈ వివరాలన్నీ వెల్లడించాల్సివుండగా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు తమతమ పరిధిలో పనిచేస్తున్న ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు చెప్పాలని పేర్కొరది. చరాస్తుల వివరాల నమోదుకు కేంద్ర పరిధిలోని డిఓపిటి (డిపార్ట్‌మెరట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అరడ్‌ ట్రైనిరగ్‌) శాఖ ప్రత్యేక ప్రొఫార్మాను విడుదల చేసి అన్ని రాష్ట్రాలకు పంపిరచిరది. అధికారి పేరు, ఆయన క్యాడర్‌, ఐడి నంబర్‌, తీసుకురటున్న జీతం, షేర్లు, సెక్యూరిటీలు, డిబెరచర్లు, ఇతర ఆర్థిక పెట్టుబడుల వివరాలు చెప్పాలని ప్రొఫార్మాలో పేర్కొరది. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ నురచి అన్ని శాఖలల్లోని ఐఏఎస్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఇవే కాపీలను రాష్ట్ర డిజిపి, పిసిసిఎఫ్‌లకు కూడా పంపిస్తూ వారి ద్వారా అరదరు ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు పంపిరచాలని నిర్దేశిరచారు.