- వచ్చే నెల నుంచి అమలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సచివాలయంలో పనిచేసే అఖిల భారత సర్వీసు అధికారులకు కూడా ఇకపై ముఖచిత్ర గుర్తిరపు ఆధారిత హాజరును అమలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని శాఖలకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. అయితే వీరికి ప్రత్యేకంగా మొబైల్‌లోనే ఒక యాప్‌ను పొందుపరిచి, దాని ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. ఇప్పటికే ఐటి, కమ్యూనికేషన్స్‌శాఖ ద్వారా యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ను సిఎఫ్‌ఎస్‌ఎస్, ఐటి శాఖల ద్వారా అధికారులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు కూడా ఇక హాజరును యాప్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఈ ప్రక్రియపై అధ్యయనం చేయనున్నారు. ఆ తరువాత అరదరికీ తప్పనిసరి చేయనున్నారు.










