Oct 08,2022 09:08

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సిఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డితో 2021 బ్యాచ్‌కు చెందిన 9 మంది ఐఎఎస్‌ ప్రొబేషనర్స్‌ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ.. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ.. ముందుకు సాగాలని సిఎం మార్గనిర్ధేశం చేశారు. అందరికీ అభినందనలు తెలిపారు.