May 30,2023 15:14

అమరావతి: సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్‌ కాలేజీ గుర్తింపును నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రద్దు చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్‌ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరిట సుజనా చౌదరీ ఈ కాలేజీ ఏర్పాటు చేశారు. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ కింద ఏటా వంద మెడికల్‌ అడ్మిషన్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్‌ ద్వారా కేటాయించేవారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఈ కాలేజీ పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) గుర్తించింది.