Jun 26,2023 22:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిని బంగ్లాదేశ్‌ డిప్యూటీ హై కమిషనరు షెల్లీ సాలెహీన్‌ కలిశారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వీరు భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను షెల్లీ సాలెహీన్‌ అడిగి తెలుసుకున్నారు.