న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి మారకం విలువ పడిపోయింది. సోమవారం సెషన్‌లో డాలర్‌తో రూపాయి విలువ 15 పైసలు కోల్పోయి 82.73కు దిగజారింది. దేశీయ మార్కెట్లలో స్తబ్దత, ఎఫ్‌ఐఐల రాకలో తగ్గుదల రూపాయిని ఒత్తిడికి గురి చేస్తుంది. శుక్రవారం సెషన్‌లో డాలర్‌తో రూపాయి విలువ 82.58 వద్ద ముగిసింది. డాలర్ విలువ పెరగడం, ఆసియన్ మార్కెట్ల పతనం రూపాయి విలువపై ఒత్తిడిని పెంచిందని బిఎన్‌పి పరిబాస్‌కు చెందిన షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరీ పేర్కొన్నారు.










