ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కేంద్ర పథకాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను తక్షణం సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఎ) బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు పిఎప్‌ఎంస్‌నుండి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. కేంద్ర పథకాల కోసం వినియోగించాల్సిన 3,873 కోట్ల రూపాయలు ఇంకా రాష్ట్ర ఖజానాలోనే ఉన్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు. వాటిని ఎస్‌ఎన్‌ఎలో జమచేయడం ద్వారా పథకాల అమలును కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు,. ప్రతి యేటా రాష్ట్రంలో అమలు చేసే పలు కేంద్ర పథకాలకు కేంద్రం కొంత నిధులు ఇస్తుంది. దీనికి రాష్ట్రం కూడా తన వాటా నిధులను జత చేయాల్సి ఉంటుంది.
మొత్తం పథకాలకు వ్యయం చేయాల్సిన 3,973 కోట్లలో కేంద్రం నుంచి 1,860 కోట్లు రాగా, రాష్ట్రం తన వాటాగా 2,113 కోట్లు జత చేయాల్సి ఉరది. ఈ మొత్తాన్ని 21 రోజుల్లోగా ఎస్‌ఎన్‌ఏ ఖాతాకు జమ చేయాలని మార్గ దర్శకాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆర్థిక శాఖ ఈ మార్గదర్శకాలను పట్టించుకోలేదు.
దీంతో ఏయే పథకాలకోసం ఎంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎన్‌ఏలో జమచేయాలో పేర్కొంటూ కేంద్రం లేఖ రాసింది.











