హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం ఎసిల అమ్మకాలపై దృష్టి కేంద్రీకరించినట్లు సామ్‌సంగ్ ఇండియా పేర్కొంది. రాష్ట్రంలో అమ్ముడవుతున్న 50 శాతం కంటే ఎక్కువ ఎసిల్లో ప్రీమియం విండ్‌ఫ్రీ విభాగంలోనివేనని పేర్కొంది. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని.. ప్రస్తుత ఏడాది ద్వితీయార్థంలోనూ ఈ వృద్థి జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. 2023లో తమ సంస్థ విక్రయిస్తోన్న ఎసిల్లో 14 మోడళ్లు ఎఐ ఎనర్జీ మోడ్‌తో వస్తున్నాయని పేర్కొంది. వీటి ధరలు రూ.35,599 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.










