Jul 21,2023 08:42

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఆప్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. 370వ అధికరణ కేసు కన్నా ముందుగా ఈ పిటిషన్‌ను విచారించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.