Nov 02,2023 13:25

తెలంగాణ : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద బేగంపేట పోలీసులు చంద్రబాబు ర్యాలీపై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేశారని ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 5312023 కేసు నమోదైంది. ఐపిసి సెక్షన్‌ 341, 290, 21 రెడ్‌ విత్‌ 76 సిపి యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

                                                      సోషల్‌ మీడియా ప్రచారంతో విమానాశ్రయానికి కార్యకర్తలు...

మంగళవారం రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు బుధవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. చంద్రబాబుకు మద్దతు కోరుతూ అందరూ రావాలంటూ నాయకులు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేశారు. దీంతో దాదాపు 2 వేల మంది టిడిపి కార్యకర్తలు అక్కడకు వచ్చారు. సాయంత్రం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాన్వారును అనుసరిస్తూ పార్టీ జెండాలు, ప్లకార్డులతో ముందుకు కదిలారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకోవడానికి దాదాపు మూడున్నర గంటలు పట్టింది.

                                                                       ర్యాలీకి అనుమతి పొందలేదు..

హైదరాబాద్‌లో సాధారణ సమయాల్లోనే ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. పైగా, ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. దీని ప్రకారం టిడిపి తెలంగాణలో పోటీ చేయకపోయినా రిటర్నింగ్‌ అధికారి నుంచి ర్యాలీకి అనుమతి పొందాలి. 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడటంతోపాటు ర్యాలీలో వాహనాలను అడ్డదిడ్డంగా నడిపి, అంబులెన్స్‌లకు సైతం దారి ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్‌ చేసి ప్రజలను ఇబ్బందులను గురిచేశారని చంద్రబాబుపై ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ సిటీ టిడిపి పార్టీ జనరలసెక్రెటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. సుమారు 400మంది ర్యాలీలో పాల్గన్నారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు.