Oct 11,2023 18:43

అమరావతి: ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద సుదీర్ఘ వాదనలు వినిపించారు. కేసు వివరాలు, ఎందరిని అరెస్టు చేశారనే విషయాలను జడ్జికి వివరించారు. చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని వాదించారు. పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగించేందుకు సమ్మతించిన ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది. వాదనల అనంతరం ఏసీబీ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది.కాల్‌ డేటా పిటిషన్‌పై తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టును కోరగా.. గురువారం మధ్యాహ్నం వాదనలు వినేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. అంతకు ముందు టిడిపి నేత చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన రైట్‌ టు ఆడియెన్స్‌ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది.