Aug 02,2022 15:41

ఆస్పరి: ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పిలుపు ఈ మేరకు ఈ నెల 5న కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉపాధి కూలీలకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.బాలకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం కైరుప్పల గ్రామంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గని మాట్లాడుతూ జాబ్‌ కార్డ్‌ ఉన్న ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. రోజువారి వేతనం రూ.600లు ఇవ్వాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గతంలో మాదిరిగానే 5 కిలోమీటర్లు దాటితే చార్జీలు, గడ్డ పార,బుట్ట,సమ్మర్‌ అలవెన్స్‌, మేటిలకు రూ.6,000లు వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధి కిట్లు పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ప్రతి నెల రేషన్‌తో పాటు 15 రకాల నిత్యవసర వస్తువులను పంపిణీ చేసి ప్రజను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు,వీరేష్‌, వెంకటేష్‌, కాశన్న పాల్గొన్నారు..