Aug 30,2023 17:03

ప్రజాశక్తి- క్రోసూరు (గుంటూరు) : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌ డౌన్‌ కార్యక్రమం విజయవంతమైంది. సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌ కక్షిదారులు లేక వెలవలాడిపోయింది. ప్రతిరోజు దాదాపు 20 నుండి 30 వరకు దస్తావేజులు ఆఫీసు నందు రిజిస్టర్‌ అయ్యేవి.. కానీ నేడు పెన్‌ డౌన్‌ కార్యక్రమం వల్ల ఒక రిజిస్టర్‌ కూడా కాలేదు. ఈ సందర్భంగా సరిమెళ్ళ రామీ రెడ్డిమాట్లాడుతూ.. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రేమ్‌ 2.0 వల్ల దస్తావేజు లేఖర్లు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వము కూలీల కోసం ఉపాధి హామీ పథకాలు ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వంపై ఆధారపడకుండా కక్షిదారులకు సహాయపడుతూ ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే దస్తావేజు లేఖర్లను రోడ్డు పడేసే విధంగా ప్రైమ్‌ 2.0 విధానాన్ని విడనాడాలని కోరారు. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని క్రోసూరు సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌ నందు సుమారు 50 మంది బ్రతుకుతున్నారని ప్రభుత్వం చేపట్టే ప్రైమ్‌ 2.0 వల్లపథకం వల్ల 50 మంది ఉపాధి కోల్పోతారని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం దూర దష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు.