ముంబయి :ముంబయి : భారత విదేశీ మారకం నిల్వలు వరుసగా మూడో వారంలోనూ పతనమై.. 11 వారాల కనిష్టానికి తగ్గాయి. ఈ నెల 17తో ముగిసిన వారంలో రిజర్వ్ బ్యాంక్ వద్ద ఫారెక్స్ నిల్వలు 5.7 బిలియన్ డాలర్లు తగ్గి 561.27 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసిన వారానికి 4.5 బిలియన్ డాలర్లు తగ్గి 496.07 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల 17తో ముగిసిన వారానికి బంగారం నిల్వలు కూడా తగ్గుముఖం పట్టాయి. 100 కోట్ల డాలర్ల విలువైన బంగారం నిల్వలు తగ్గి 41.82 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రూపాయి విలువ మరింత పతనం కాకుండా డాలర్లు విక్రయించడమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.










