Mar 01,2023 20:06

వాషింగ్టన్‌ : అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం పెరగడంతో అక్కడి వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల మధ్య వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ వినియోగదారుల విశ్వాసం పడిపోయింది. జనవరిలో ఈ సూచీ 106గా ఉండగా, ఫిబ్రవరిలో 102.9కు తగ్గింది. ఈ తగ్గుదల 35 నుండి 54 సంవత్సరాల వయస్సు గల కుటుంబాలకు, ముఖ్యంగా 35వేల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న కుటుంబాల్లో అధికంగా విశ్వాసం పడిపోయిందని ది కాన్ఫరెన్స్‌ బోర్డ్‌లోని ఆర్థిక శాస్త్ర సీనియర్‌ డైరెక్టర్‌ మాటమాన్‌ ఓజిల్డిరిమ్‌ పేర్కొన్నారు.