Sep 01,2023 09:53

రెడ్డిగూడెం (కృష్ణా) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలపై రోజు రోజుకి భారాలు పెరుగుతున్నాయని ప్రధానంగా నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్తు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరగటం వలన ప్రజలు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, రైతుల పై భారాలు పడుతున్నాయని, ఆదాయం కంటే అప్పులు పెరుగుతున్నాయని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్సన్నపేట గాంధీ బమ్మ సెంటర్లో కేంద్ర కమిటీ పిలుపుమేరకు ... అధిక ధరలపై శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ... ప్రజల ప్రయోజనాల కంటే కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ నాయకులు మేకల జ్ఞాన రత్నం, రైతు సంఘం నాయకులు పులిబల్ల ఏడుకొండలు, తాపీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ మరీబోయిన అప్పారావు, సెక్రెటరీ పోతురాజు, శ్రీనివాసరావు, గాబ్రెల్‌ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.