Oct 01,2023 14:34

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని 15నెలలు అయిన నేటికి మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం విపలమైందని రైతుసంఘం రాష్ట్రకార్యదర్శి వి కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం రైతు, కౌలురైతు సంఘాల ఆద్వర్యంలో గుండ్లకమ్మ గేట్లు తక్షణమే మరమ్మతులు చేపట్టి కాలువల పూడిక తొలిగించాలని కోరుతూ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుండి గుండ్లకమ్మ జలాశయం వరకు చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంబించారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఇరిగేషన్ సంబందించి 11వేల కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. అందులో కేవలం 3400కోట్లు మాత్రమే ఖర్చుచేసారన్నారు. అందులో కనీసం కోటి రూపాయలు కేటాయించి గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేయలేని దౌర్చాగ్య పరిస్థితుల్లో ఈప్రభుత్వం ఉందని ఎద్దేవా చేసారు. పలుమార్లు మంత్రుల దృష్టికీ తీసుకువెళ్ళిన చీమకుట్టినట్లు కూడ లేదని దుయ్యబట్టారు. గేట్లుమరమ్మతులకు గురవడంతో ప్రాజెక్టు పరిదిలో ఉన్న 80వేల ఎకరాలు సాగు ప్రశ్నార్దకంగా మారిందన్నారు. ఈపాటికే ఖరీప్ సాగు విస్తీర్ణం ఘననీయంగా తగ్గిందన్నారు. కనీసం ఆరతడలైన నీరువస్తుందో లేదని రైతాంగం ఆందోళనతో ఖరీప్ పంటలైన మిర్చి మాగాణి పంటలకు దూరమైనారు తద్వార రైతాంగం ఓకప్రక్క దెబ్బతినగా మరోప్రక్క కూలీలకు పనులు లేక ఆదాయం కోల్పోయారన్నారు. సాగర్ నీరు వచ్చినప్పటికి నిల్వచేసుకొనే వీలులేదన్నారు ఈసమస్య ఏఓక్క రాజకీయ పార్టికీ సంబందించినది కాదన్నారు. ప్రతిఓక్క రైతుకు సాగు నీరు అవసరమన్నారు. రాజకీయపార్టీల కతీతంగా పోరాడవలసిన అవసరముందన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి గేట్లుమరమ్మతులు కాలువలపూడిక తీసి రబీలో లైన రైతాంగానికి సాగుచేపట్టడానికి నీళ్ళుఅందిస్తామని భరోసా కల్పించవలసిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేనిచో సాగునీరు అందించే వరకు పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అందుకు రైతులందరు పార్టీలకు అతీతంగా ఐక్యంగా రైతు కౌలురైతు సంఘాల ఆద్వర్యంలో చేపట్టే ఆందోళనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పాదయాత్ర నాగులుప్పలపాడు నుండి పోతవరం నిడమానూరు లమీదగా గ్రోత్ సెంటరు మీదగా గుండ్లకమ్మ జలాశయం వరకు సాగింది. ఈకార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లాఅద్యక్ష కార్యదర్శులు ఎస్ కె మాబు, వి బాలకోటయ్య, ఉపాదక్షులు టి శ్రీకాంత్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు, ఉపాదక్షులు జె జయంతిబాబు, ఆచార్యరంగా కిసాన్ సంఘం నాయకులు చుంచు శేషయ్య, చుండూరి రంగారావు, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు జాలా అంజయ్య , వివిదగ్రామాల రైతులు కౌలురైతులు తదితరులు పాల్గొన్నారు. 

rythu-koulu-rythu-sanghala-padayatra-in-prakasam