Aug 17,2023 08:02

హవాయి: వారం రోజులుగా హవాయి ద్వీపాన్ని దహించివేస్తున్న భయానక కార్చిచ్చులో మృతుల సంఖ్య 106కి చేరింది. పెద్దయెత్తున ఎగసిపడుతున్న మంటల వల్ల చారిత్రిక పట్టణం లాహైనా కొద్ది గంటల్లోనే మొత్తం నాశనమైపోయింది. ఈ షాక్‌ నుంచి బాధితులు ఇప్పటికీ తేరుకోలేదు. ఇంతటి విపత్తు సంభవిస్తే అమెరికా ప్రభుత్వానికి ఏమీ పట్టినట్టు లేదు. అధ్యక్షుడు బైడెన్‌ ఇప్పటివరకు ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో బాధితులను పరామర్శించేందుకు వచ్చే సోమవారం సతీసమేతంగా వెళ్లానని బైడెన్‌ చెప్పారు. దీనికి ముందు అరకొర సాయం ప్రకటించారు. సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదనే హవాయి ద్వీపాన్ని ఆలస్యంగా సందర్శిస్తున్నానని అధ్యక్షుడు చెప్పారు.