May 30,2023 14:35
  • రక్షణ కల్పనలో ప్రభుత్వ శాఖలు విఫలం

ప్రజాశక్తి:- చిలమత్తూరు(అనంతపురం) : ప్రతి రోజు విదేశీ విహంగాల కిల కిల రావాలతో మేల్కొనే వీరాపురం గ్రామం, పక్షుల ఆర్థనాదాల మధ్య ఒక్క సారిగా ఉలిక్కి పడింది. నిత్యం ఉదయాన్నే పక్షుల పెంటను శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు కుప్పలు తిప్పలుగా పడిన పక్షి పిల్లల కళేబరాలను తీస్తూ కన్నీటీ పర్యాంతం అయ్యారు. చెట్ల క్రింద ముళ్ల కంపలలో చిక్కుకొని అతలాకుతలం అయిన ప్రదేశాలలో వేలాడుతున్న పిల్ల పక్షులను చూస్తున్న తల్లి పక్షుల దీన స్థితి పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఉదంతానికి పకృతి విలయం ఎంత కారణమో సంబందిత శాఖల వైపల్యం అంతే ఉంది.

  • ఎల్లలు దాటిన అతిదుల కళ చిద్రమైంది

ప్రతి ఏటా పిబ్రవరిలో రష్యా నుండి ఎల్లలు దాటి సంతానోత్పత్తి కోసం వీరాపురం వెంకటాపురంకు వచ్చే ఎర్రకాళ్ల కొంగలు వాటి సంతానాన్ని చేసుకొని జూలై, ఆగస్టులో తమ పిల్లలను తమతో పాటు తీసుకొని సంతోషంతో తిరిగి పయణం పడతాయి. సంతానోత్పత్తికి అనువైన ప్రదేశంగా భావించి వీరాపురంకు వచ్చే ఈ అతిధి పక్షులకు ఆ గ్రామానికి శతాబ్దాల అనుబందం ఉంది. ప్రతి ఏట ఆహారం అందక మృతి చెందే ఈ పక్షుల రాక రాను రాను తగ్గినా గత రెండేళ్లుగా వర్షాపాతం ఎక్కువ నమోదు కావడంతో పక్షుల సంఖ్య విపరీతంగా పెరిగింది. చెట్టుల నిండా గూళ్లతో.. పక్షుల కిల కిల రావాలతో ఆ పల్లే ప్రాంతం పర్వసిందించి. ఇంతలోనే సోమవారం రాత్రి పకృతి విలయ తాండవానికి ఒక్క సారిగ ఉలిక్కి పడింది. గ్రామంలో పక్షుల ఆర్థనాదపు అరుపులతో విషాయ చాయలు అలముకున్నాను. ఏ చెట్టు క్రింద చూసిన కాళ్లు విరిగి కుంటుతున్న పక్షులు రెక్కలు విరిగి ఎగరలేక అగచాట్లు పడుతున్న పక్షులు మృతి చెందిన పక్షుల శరీరాలు దర్శనం ఇచ్చాయి.