
పుణె: దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్, మిడిలార్డర్ బ్యాటర్ డుస్సెన్ సెంచరీలతో కదం తొక్కారు. క్వింటన్ డికాక్(114; 116 బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సర్లు) ఈ ప్రపంచకప్‌లో నాల్గో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక వాండర్ డుస్సెన్(133; 118బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్లు) రెండో శతకాన్ని కొట్టాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (53; 30బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి అర్ధ శతకం సాధించాడు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 357పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది.
టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ తెంబా బావుమా(24) త్వరగా పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 2 వికెట్‌కు డుస్సెన్‌ాడికాక్ కలిసి ఏకంగా 200పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ ఆరంభంలో డికాక్ నెమ్మదిగా ఆడాడు. డికాక్‌ాడుస్సెన్ తొలుత నిలకడగా ఆడినా.. ఆ తర్వాత బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో డికాక్ 103బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని సౌథీ విడదీశాడు. అతడి బౌలింగ్‌లో డికాక్.. ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటికే నీషమ్ బౌలింగ్‌లో ఫోర్ బాది డుస్సెన్ 101 బంతుల్లో శతకాన్ని కొట్టాడు. వ్యక్తిగత స్కోర్ 133పరుగుల వద్ద డుస్సెన్‌ను సౌథీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న మిల్లర్ దూకుడుగా ఆడాడు. నీషమ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సిక్స్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న మిల్లర్.. తర్వాతి బంతికే డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీకి రెండు, ట్రెంట్ బౌల్ట్, నీషమ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: క్వింటన్ డికాక్ (సి)ఫిలిప్స్ (బి)సోథీ 114, బవుమా (సి)మిఛెల్ (బి)బౌల్ట్ 24, డుస్సెన్ (బి)సౌథీ 133, మిల్లర్ (సి)మిఛెల్ (బి)నీషమ్ 53, క్లాసెన్ (నాటౌట్) 15, మార్‌క్రమ్ (నాటౌట్) 6, అదనం 12. (50 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 357పరుగులు.
వికెట్ల పతనం: 1/38, 2/238, 3/316, 4/351
వికెట్ల పతనం: బౌల్ట్ 10-1-49-1, హెన్రీ 5.3-0-31-0, సోథీ 10-0-77-2, సాంట్నర్ 10-0-58-0, ఫిలిప్స్ 7-0-52-0, రవీంద్ర 2-0-17-0, నీషమ్ 5.3-0-69-1.