- ఆస్తుల కేసులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
బెంగుళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని డీకే శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు గురువారం కొట్టి వేసింది. మూడు మాసాల్లో విచారణను పూర్తి చేయాలని సీబీఐని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆస్తుల కేసులో సీబీఐ విచారణపై 0న్న స్టేను కర్ణాటక హైకోర్టు ఎత్తివేసింది.










