కర్ణాటక : కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఒక గద్ద ఢకొీంది. దీంతో హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములబాగిలు వెళ్తుండగా హొసకొటే వద్ద ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను గద్ద ఢకొీంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. డీకే శివకుమార్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కెమెరామెన్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు.










