Sep 01,2023 10:17

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడి (ఫిషింగ్‌) జరిగిందని సర్వోన్నత న్యాయస్థారం గురువారం సర్క్యూలర్‌ జారీ చేసింది. రిజిస్ట్రీ వెబ్‌సైట్‌ మాదిరిగా ఉన్న డొమైన్‌తో ఫేక్‌ వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేశారని పేర్కొంది. దీంతో యూజర్ల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని కోరుతున్నారని తెలిపింది. యుఆర్‌ఎల్‌ ఉన్న వెబ్‌సైట్‌లో యూజర్లు వ్యక్తిగత, రహస్య డేటాను పంచుకోవద్దని అడ్వైజరీ జారీ చేసింది. వ్యక్తిగత డేటాను ఇస్తే నేరగాళ్లు చోరీ చేసే అవకాశాలున్నాయని తెలిపింది. యూజర్లు అనుమానాస్పదంగా ఉండే లింక్‌లపై క్లిక్‌ చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అసలైన వెబ్‌సైట్‌ అని ధ్రువీకరించిన తర్వాత అందులోకి వెళ్లాలని, రిజిస్ట్రీ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు, ఇతర సమాచారాన్ని ఎప్పుడూ కోరదని అడ్వైజరీలో తెలిపింది.