Mar 21,2023 10:28

వాషింగ్టన్‌ : ప్రముఖ టెక్‌ దిగ్గజం అమెజాన్‌ మరో 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. వచ్చే కొన్ని వారాల్లోనే ఈ తొలగింపులు ఉండనున్నాయని అమెజాన్‌ సిఇఒ ఆండీ జస్సీ పేర్కొన్నట్లు సిఎన్‌బిసి ఓ రిపోర్ట్‌లో తెలిపింది. అత్యధికంగా అమెజాన్‌ వెబ్‌ సీరిస్‌(ఎడబ్ల్యుఎస్‌), అడ్వర్టజింగ్‌, ట్విట్చ్‌, పిఎక్స్‌టి విభాగాల్లో అధికంగా తొలగింపులు ఉండొచ్చని తెలుస్తోంది. ఇంతక్రితం డిసెంబర్‌- జనవరి కాలంలో ఈ సంస్థ 18వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గత వారం మెటా మరో 10వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ సంస్థ కూడా 11వేల మందికి ఉద్వాసన పలికింది.