Apr 20,2023 21:40

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా వేదిక 'కూ'లో 30 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కూ ఇటీవల 260 మందిపై వేటు వేసిందని పేర్కొంది. అంతర్జాతీయంగా నెలకొన్న స్ధూల ఆర్ధిక అంశాల నేపథ్యంలో ఉద్యోగుల కోతకు మొగ్గు చూపింది. గతేడాది ఓ దశలో ట్విట్టర్‌తో భారత అధికారులకు ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో కూకు ప్రాధాన్యత పెరిగింది. బాధిత ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్‌తో పాటు వైద్య బెనిఫిట్స్‌ సహా కొత్త ఉద్యోగాలను అన్వేశించే క్రమంలో తమ సిబ్బందికి సాయం అందిస్తామని కూ ప్రతినిధి పేర్కొన్నారు. కూ సంస్థకు అంతకుముందు ఏడాదితో పోలిస్తే మార్చితో ముగిసిన త్రైమాసికంలో 75 శాతం మేర ఫండింగ్‌ తగ్గిన నేపథ్యంలో తొలగింపులు చోటు చేసుకున్నాయనే సాంకేతాలు వస్తున్నాయి.