ప్రజాశక్తి-మార్టూరురూరల్(బాపట్ల) : జిల్లాలోని మార్టూరు మండలంలో మంగళవారం గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో మార్టూరు - యద్దనపూడి మధ్యగల చప్టాపై నీరు ఉదతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహాన్ని లెక్క చేయకుండా దాటాలని ప్రయత్నించిన పర్చూరు మండలం బొడవాడ గ్రామానికి చెందిన కూనంనేని వీరాంజనేయులుని బైక్‌తో సహా కొట్టుకుపోతూ వాగు మధ్యలో ఉన్న చెట్టు కొమ్మలు పట్టుకొని ప్రాణాలను నిలుపుకున్నాడు. కాపాడాలని బిగ్గరగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచారు. వెంటనే రంగంలోకి దిగిన మార్టూరు సిఐ షేక్ థెరిసా ఫిరోజ్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. రెండు గంటలు శ్రమించి నీటిలో చిక్కుకుపోయిన వీరాంజనేయులుని తాళ్ల సహాయంతో కాపాడారు. అనంతరం మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.











