
ప్రజాశక్తి - చిలమత్తూరు (అనంతపురం) : విద్యుత్ కోతలు ఆపాలని డిమాండ్ చేస్తూ ... చిలమత్తూరు దేమకేతేపల్లి పంచాయతీ రైతులు దేమకేతేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అప్రకటిత విద్యుత్ కోతలు, వ్యవసాయానికి ట్రీపేస్ విద్యుత్ రాకపోవడం, నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో తమ బోర్ల కింద పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో గత మూడు నెలలుగా తాము ఇబ్బంది పడుతున్నామని అయితే విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదని అన్నారు. దీంతో చేసేదేమి లేక ఆందోళన చేపడుతున్నామని వాపోయారు.