Jul 10,2023 15:19

ప్రజాశక్తి-గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని గాజులపల్లి గ్రామంలో అప్పుల బాధ తాళలేక సోమవారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వరి మడుగు నాగిరెడ్డి (62) అనే రైతు తనకున్న 9 ఎకరాల భూమిలో పత్తి, వేరుశనగ పంటల సాగు చేశాడు. గత మూడేళ్లగా పంటల దిగుబడి తగ్గింది.పంటల సాగు కోసం రూ.7 లక్షలు అప్పు అయ్యింది. పంటల సాగులో నష్టం రావడంతో పాటు చేసిన అప్పులు పెరిగాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలని మదనపడ్డాడు. మానసికంగా కృంగిపోయిన అతడు ఇంటిలో క్రిమిసంహారక మందు తాగాడు. అక్కడ నుంచి తన పొలంలోకి వెళ్లి కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రైతు మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు. పోలీసులు కేసు నమోదు చేసుకొని చేపట్టారు.