Nov 17,2023 11:54
  • సహకార పరపతి సొసైటీ మాజీ ప్రెసిడెంట్ పల్లె జయరామి రెడ్డి .

ప్రజాశక్తి-నార్పల : హెచ్ ఎల్ సి కెనాల్ ఆరుతూవులను ఎత్తి వంట సాగు చేసిన నార్పల మండల రైతులకు వెంటనే నీటిని విడుదల చేయాలని సహకార పరపతి సంఘం మాజీ ప్రెసిడెంట్ పల్లె జయరాం రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నార్పల మండల వ్యాప్తంగా హెచ్.ఎల్.సి కెనాల్ నీటి ద్వారా సుమారు 5వేల ఎకరాలు పంట భూమి సాగుతోంది అని మామూలుగా ప్రతి ఏడాది ఆగస్టు నెలలోనే తూములెత్తి పంట సాగు కాలువలకు నీటిని వదిలే వారిని ఈ ఏడాది నవంబర్ నెల వచ్చినప్పటికీ నీరు వదలలేదని దీంతో అప్పులు, చేసి అధిక పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసిన చిన్న కారు సన్న కారు రైతులు వంటకాలులకు నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కళ్ళ ముందు నీళ్లు వెళుతున్న వాడుకోలేని పరిస్థితిలో నార్పల మండల రైతులు ఉన్నారని నార్పల మండల రైతుల పొలాలకు వెళ్లే ఆరు తూములను బలవంతంగా బంద్ చేయించి తూములెత్తకుండా తమ కళ్ళ ముందరే ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలిస్తున్నారని వాటాల ప్రకారం ఎవరికి వచ్చే నీరు వారికి ఇవ్వడంలో తప్పు లేదు కానీ పంటలు సాగు చేసి నీటి కోసం ఎదురుచూస్తున్న నార్పల మండలం రైతులకు కూడా నీరు వదలాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా కొందరు బడా రైతులు కొన్ని వందల ఎకరాలను పంటను సాగు చేసుకుని వారి వారి మార్గంలో నీటిని తరలించుకొని వెళ్తున్నారని గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు రైతులతో కలిసి వెళ్లి తూములను బద్దలు కొట్టి మరి రైతులకు పంట కాలువలకు నీళ్లు వదిలారని అయితే అధికారంలోకి రాగానే అదే వైసీపీ నాయకులు తూములను బండరాళ్లు మట్టిని వేసి బంద్ చేసి మండల రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని పెట్టిన పంటలు చేతికి రాక చేసిన అప్పులు తీర్చలేక కొందరు రైతులు దిక్కు చోతని పరిస్థితిలో ఆత్మహత్య శరణం అంటున్నారని మరికొందరు పంట భూములను బీడులుగా పెట్టి కుటుంబ పోషణ కోసం గత్యంతరం లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని ఇప్పటికైనా పాలకులు ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి నార్పల మండల రైతుల దుస్థితిని గమనించి హెచ్ ఎల్ సి కెనాల్ కు ఉన్న ఆరు తూములను వెంటనే ఎత్తి పంట కాలువలకు నీరు వదిలి మండల రైతులను ఆదుకోవాలని సహకార పరపతి సంఘం మాజీ ప్రెసిడెంట్ జయరాం రెడ్డి తో పాటు మండల రైతులు కోరుతున్నారు.