Aug 11,2023 09:39

నాచారం అనే ఊరిలో యాదయ్య, విజయ అనే రైతు దంపతులు ఉన్నారు. ఒకసారి వర్షాలు పడిన తర్వాత, తమ పొలంలో పత్తి విత్తనాలు వేశారు. వీరిని చూసి ఊరి వారందరూ పత్తి విత్తనాలు వేశారు. ఇలా చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా అందరూ ఇదే పంట వేశారు. రైతులందరు పత్తి బాగా పండించారు.
కొన్ని నెలల తర్వాత రైతులు పండించిన పత్తిని మార్కెట్‌కు తీసుకెళ్లారు. పత్తి ఎక్కువ వచ్చినందు వల్ల వ్యాపారులు ఎక్కువ ధర ఇవ్వలేదు. దీంతో రైతులు నష్టపోయారు. చేసిన అప్పులు కూడా తీరలేదు. మరుసటి రోజు నాచారం రైతులందరూ గ్రామ వేదిక వద్ద సమావేశమయ్యారు.
'ఇక నుంచి మనమందరం ఒకే రకమైన పంట వేయవద్దు, వేర్వేరు పంటలు సాగు చేద్దాం. అప్పుడే మన పంటలకు మంచి గిరాకీ వస్తుంది. అప్పులు తీరతాయి' అని నిర్ణయం తీసుకున్నారు.
ఆ ప్రకారం తర్వాతి సంవత్సరం వేర్వేరు పంటలు వేశారు. కొందరు కూరగాయలు, మరికొందరు పళ్ళ తోటలు సాగుచేశారు. కొన్ని నెలల తర్వాత అందరి పంటలు చేతికి వచ్చాయి. తమ పంట ఉత్పత్తులను పట్టణానికి తీసుకెళ్ళి అమ్మారు. వేర్వేరు పంటలు కావడం వలన అన్ని పంటలకు మంచి ధర పలికింది. ఆ ఏడాది రైతులకు తగినన్ని డబ్బులు వచ్చి అప్పులు తీరాయి.

మిద్దె గణేష్‌
- మిద్దె గణేష్‌,
పదవ తరగతి,
జక్కాపూర్‌, సిద్దిపేట జిల్లా,
99590 07914.