అమరావతి : మాజీ మంత్రి దేవినేని ఉమపై క్రిమినల్ కేసు నమోదయింది. సిఎం వైఎస్.జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతోపాటు అసభ్యంగా దూషించారంటూ ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దేవినేని ఉమను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశముందని తెలియడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జగనాసుర చరిత్ర పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు దిష్టిబమ్మను దగ్ధం చేశారు. కొండపల్లిలో సిఎం దిష్టిబొమ్మను టిడిపి నేతలు దగ్ధం చేశారని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమపై ఐపిసి 149, 153ఏ, 505(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.