'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా సమయంలో నేను స్కూల్లో చదువుతున్నా. ఆ చిత్రం చూసి ఆశ్చర్యపోయాను. మెగాస్టార్ అలాంటి స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. మధ్యలో 'అంజి' సినిమా వచ్చినప్పటికీ.. అది పూర్తి స్థాయి ఫాంటసీ చిత్రంగా రూపొందించలేదు. ఇక 'విశ్వంభర'లో 70 శాతం స్పెషల్ ఎఫెక్ట్‌లు ఉంటాయి. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులవుతారు. నా రెండో సినిమానే చిరంజీవితో తీస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని దర్శకుడు వశిష్ఠ చెప్పారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి దర్శకుడు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 'బింబిసార' తరహాలో 'విశ్వంభర' (టైటిల్ ఖరారు కాలేదు) పరిశీలిస్తున్నట్లు చెప్పారు.