Aug 15,2023 20:32

చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'భోళా శంకర్‌'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇప్పుడీ చిత్రం హిందీలోనూ విడుదలకు సిద్ధమైంది. తెలుగులో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో ఆర్కేడీ స్టూడియోస్‌ ఈనెల 25న విడుదల చేయనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్‌ హిందీ వెర్షన్‌ టీజర్‌ను విడుదల చేశారు. హిందీలో చిరంజీవికి జాకీ ష్రాఫ్‌ డబ్బింగ్‌ చెప్పారు. చిరంజీవి సరసన తమన్నా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, సుశాంత్‌, తరుణ్‌ అరోడా, మురళీ శర్మ, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.