Sep 11,2023 20:18

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్‌ వశిష్ట దర్శకత్వంలో ప్రకటించిన 157వ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. 'త్వరలో మీ అందరినీ సినిమాటిక్‌ అడ్వంచర్‌కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాము' సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్న వశిష్ట ట్వీట్‌చేశారు. చిరంజీవి, నిర్మాత, డిపిఒ చోటా కె నాయుడుతో ఉన్న డీవోపితో కలసివున్న ఫొటోని షేర్‌ చేశారు. ఈ మెగా మాస్‌ బియాండ్‌ యూనివర్స్‌ ప్రాజెక్ట్‌కు సంబధించిన ఇతర తారాగణం, టెక్నికల్‌ బృందం వివరాలను త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ సినిమాకు నిర్మాతలు వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌లు వ్యవహరించనున్నారు.