Feb 09,2023 14:35

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) :నందిగామలోని కోర్టు ప్రాంగణంలో వేగవంతంగా నిర్మాణం అవుతున్న సబ్‌ కోర్టు, ఏడిఎం కోర్టులను ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్‌ మోషే, ఆర్‌అండ్‌బి ఈఈ కృష్ణ నాయక్‌లు గురువారం పరిశీలించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కన్నె కంటి జీవరత్నం, ఆర్‌ అండ్‌ అధికారులతో కలిసి బిల్డింగ్‌ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ శ్రీరామూర్తి, ఏజీపి మట్టప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాదులు బండారు సుధాకర్‌, బొందలపాటి రామకృష్ణ, మన్నే నారాయణ, హనుమంతరావు, కాంట్రాక్టర్‌ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.